మాంజో అంటే ఏమిటి?

ఆరోగ్యవంతమైన మరియు గొప్ప ప్రత్తి పంటను పొందడానికి రైతులు ఎల్లప్పుడూ తెల్లదోమతో ఇబ్బంది పడతారు.

పత్తి పంటపై తెల్లదోమ దాడి సమస్యను పరిష్కరించడానికి, సుమిటోమో కంపెనీ ఒక క్రొత్త వినూత్నమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది .... మాంజో

మాంజో స్పర్శ చర్య మరియు అంతర్వాహిక చర్య కలిగిన కీటకనాశని. మాంజో ఒక పిచికారీ వలన తెల్లదోమలు, పైముడత, పచ్చదోమ మరియు పేనుబంక పురుగులు నియంత్రించబడతాయి. మాంజో రెండు పురుగుమందుల సంపూర్ణ కలయిక.

తెల్లదోమ మరియు దాని కుటుంబ నియంత్రణకు మాంజో ఒక ప్రభావంతమైన పరిష్కారం.


Sumitomo Manzo Pack shot and icon

తెల్లదోమలు మరియు పిల్లదోమలు ఆకుల నుంచి రసాన్ని పీల్చి వాటిని బంకలా చేస్తాయి. సూటీమోల్డ్ శిలీఛం ఆకులమీద వ్యాపించి వాటిని నల్లగా చేస్తాయి. ఇది కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను బాగా ప్రభావితం చేస్తుంది, అందువలన ఆకులు రాలిపోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా పంట దెబ్బతిని దిగుబడి బాగా తగ్గిపోతుంది.

మాంజో కీటకాల జీర్ణవ్యవస్థను బలహీన పరుస్తుంది అంతేకాకుండా కీటకాన్ని తాకిన వెంటనే దాన్ని చంపేస్తుంది.

మాంజో తెల్లదోమ యొక్క అన్ని దశలపై అంటే గ్రుడ్లు, నింప్స్ మరియు పెద్ద దోమల మీద పనిచేస్తుంది మరియు వాటి పెరుగుదలను నిరోధిస్తుంది, అంతే కాకుండా ఇది తెల్లదోమ యొక్క గ్రుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది కీటకాల యొక్క మరింత వ్యాప్తిని నియంత్రిస్తుంది. నిజంగా చెప్పాలంటే మాంజో తెల్లదోమ యొక్క పూర్తి జీవిత చక్రాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తుంది.

మాంజో యొక్క లాభాలు


Sumitomo Manzo Pack shot and icon

మాంజో పిచికారీ వలన రసం పీల్చే పురుగులైన తెల్లదోమలు రసం పీల్చడం వెంటనే ఆగిపోతుంది మరియు వాటి పెరుగుదల ఎక్కువ కాలం పాటు నియంత్రించబడుతుంది. పంట ఆరోగ్యాంగా, బలంగా మారుతుంది మరియు ఎక్కువ పువ్వులను, కాయలను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన దిగుబడి వస్తుంది.

మాంజో తెల్ల దోమ యొక్క అన్ని దశలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది మరియు దాని మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది.

మాంజో లో కణాంతర మరియు ఆవిరి చర్య వుంది కాబట్టి పంటలో దాగి వున్నా కీటకాలను చంపేస్తుంది.

మాంజో ఫలితాలు


Sumitomo Manzo in Cotton Crop

Sumitomo Manzo in Cotton Crop

Sumitomo Manzo in Cotton Crop

మాంజో ఎలా వాడాలి


పంట పై తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, మరియు పైముడత కనిపించిన వెంటనే మాంజో పిచికారీ చేయాలి.

ఉత్తమమైన ఫలితాల కోసం మొదటి పిచికారీ తరువాత 10-15 రోజుల మధ్య మాంజో రెండవసారి పిచికారీ చేయాలి.

మాంజో 400 మీ.లీ మోతాదు 150-200 లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని తయారుచేసి, ఒక ఎకరం పంటలో ఏకరీతిగా పిచికారీ చేయాలి.

మంచి ఫలితాల కోసం 15 లీటర్ల స్ప్లే ట్యాంకులో 5 మీ.లీ షూర్ షాట్ కలపండి.

పిచికారీ చేసిన కొన్ని గంటల తరువాత వర్షం పడినా మాంజో ప్రభావవంతంగా ఉంటుంది.

మీరు మాంజో ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా?

ఒకవేళ మీరు మాంజో ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మీకు మాంజో సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.