తారీఫ్ అంటే ఏమిటి?

తారీఫ్ పంట పెరుగుదల మరియు వృద్ధి కోసం తయారు చేయబడిన సేంద్రీయ ఉత్పాదన. తారీఫ్ ఒక స్థిరమైన మరియు సంతులనమైన సూత్రీకరణ.

తారీఫ్ సేంద్రీయ జిబ్బరెలిక్ ఆమ్లము, సముద్రపునాచు యొక్క సారం మరియు సూక్ష్మదాతు పోషకాల కలయికతో కూడిన మేలైన ఉత్పాదన. తారీప్ మొక్క యొక్క జీవక్రియను పెంచి తద్వారా మంచి పెరుగుదల ఎక్కువ పూత మరియు కాయలు రావడంలో తోడ్పడుతుంది. తారీఫ్ నాణ్యత కలిగిన మెరుగైన దిగుబడిలో తోడ్పడుతుంది.

పంటకు అవసరమైన సూక్ష్మపోషకాలను అందిస్తుంది. పంట పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు నియంత్రిస్తుంది. నాణ్యతతో కూడిన అధిక దిగుబడిలో తోడ్పడుతుంది.

తారీఫ్ని ప్రయోగించడం వలన కలిగే ప్రయోజనం


Sumitomo Tareef Pack shot and icon

తారీఫ్ పంట యొక్క వివిధ దశలలో పోషకాలు అందేలా చేస్తుంది.

తారీఫ్ మొక్క ఆకులలోని పత్రహరితాన్ని మెరుగు పరచి ప్రభావవంతమైన కిరణజన్య సంయోగక్రియలో తోడ్పడుతుంది.

తారీఫ్ పంటను వత్తిడి పరిస్థితులను తట్టుకునేలా చేస్తుంది.

తారీఫ్ మొక్క యొక్క ఏకరీతి పెరుగుదల, అధిక పూత మరియు కాయలు రావడంలో తోడ్పడుతుంది.

తారీఫ్ అన్ని రకాల పురుగు మందులు, తెగుళ్ల మందులు మరియు నీటిలో కరిగిపోయే ఎరువులతో కలిపి ఉపయోగించవచ్చును.

తారీఫ్ అమెరికా నుండి దిగుమతి చేసుకున్న ఆర్గానిక్ జిబ్బరెలిక్ ఆమ్లముతో కూడిన ఉత్పాదన.

తారీఫ్ ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


తారీఫ్ సిఫారసు చేయబడిన పంటలు: తారీఫ్ ద్రాక్ష, ప్రత్తి, అరటి, చెఱకు, వరి, క్యాబేజి, క్యాలీఫ్లవర్, ఉల్లి, వంగ, బెండ, వేరుశనగ మరియు మల్బరి తోటలలో ఉపయోగించుటకు సిఫారసు చేయబడినది.

మోతాదు - తారీఫ్ మోతాదు ఎకరానికి 250-300 మి.లీ.

మెరుగైన ఫలితాల కొరకు తారీఫ్ ని ష్యూర్‌షాట్ తో కలిపి పిచికారి చేయండి. తారీఫ్ పంట కాలంలో నియమబద్ధంగా 2-3 సార్లు ఈ క్రింద తెలిపిన విధంగా పిచికారి చేయాలి.

పిచికారి పంటదశ ప్రభావం
మొదటిసారి పంట పెరుగుదల సమయంలో అధిక కొమ్మలు, గుబురైన పొద
రెండవసారి పూత మొదలైనపుడు అధికమైన పూత రావడానికి మరియు పూతనిలవడానికి
మూడవసారి పిందె దశలో ఏకరీతి పరిమాణం, ఆకారం రంగు కలిగిన కాయలు మరియు అధిక దిగుబడి

మీరు తారీఫ్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా?

ఒకవేళ మీరు తారీఫ్ ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.

మీకు తారీఫ్ సంబంధించిన మరింత సమాచారం కావాలంటే దయచేసి మీ ఫోను నంబరు మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.